Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పవన్ కల్యాణ్ రాజీనామా చేస్తున్నారంటూ ప్రచారం.. పోలీసులకు ఫిర్యాదు

Pawan Kalyan resignation rumors spread police complaint filed
Advertisement
  • ఏపీ డిప్యూటీ సీఎంవో పేరుతో నకిలీ వాట్సప్ ఛానల్
  • తమకు సంబంధం లేదని స్పష్టం చేసిన పవన్ కల్యాణ్ కార్యాలయం
  • దుష్ప్రచారంపై సైబర్ పోలీసులకు జనసేన నేతల ఫిర్యాదు
Advertisement
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు నిర్వహిస్తున్న ఓ నకిలీ వాట్సప్ ఛానల్ వ్యవహారం కలకలం రేపుతోంది. ‘డిప్యూటీ సీఎంవో, ఆంధ్రప్రదేశ్‌’ పేరుతో నడుస్తున్న ఈ ఛానల్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని డిప్యూటీ సీఎంవో అధికారికంగా ప్రకటించింది. దీని బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ఈ నకిలీ ఛానల్ ద్వారా ప్రభుత్వ గుర్తింపును దుర్వినియోగం చేస్తూ తప్పుడు సమాచారాన్ని, సంబంధం లేని కంటెంట్‌ను ప్రచారం చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ‘ఎక్స్’ వేదికగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పదవికి రాజీనామా చేస్తున్నారంటూ, దీనిపై కీలక ప్రకటన రాబోతోందంటూ జరుగుతున్న విష ప్రచారాన్ని తీవ్రంగా ఖండించింది.

ఈ వ్యవహారంపై జనసేన నాయకులు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేక వైసీపీ నేతలే వెనకుండి ఈ కుట్రకు పాల్పడుతున్నారని జనసేన నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నకిలీ ఛానల్‌ను ఎవరూ నమ్మవద్దని, అందులోని సమాచారాన్ని ఫార్వర్డ్ చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఈ ఫేక్ మెసేజ్‌లు సర్క్యులేట్ చేస్తున్న వారిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.
Advertisement
Advertisement
Pawan Kalyan
Andhra Pradesh Deputy CM
Fake WhatsApp Channel
Janasena Party
Cyber Police Complaint
Resignation Rumors

More Telugu News